సెలెబ్రిటీ జంటలతో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ రియాల్టీ షో

సెలెబ్రిటీ జంటలతో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ రియాల్టీ షో

ఓ వైపు దర్శకుడిగా వరుస సక్సెస్‌‌లు అందుకుంటూనే, మరోవైపు పలు రియాల్టీ షోలకు హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్నాడు అనిల్ రావిపూడి.  తాజాగా ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ పేరుతో మొదలైన  కొత్త రియాలిటీ షోకు  జడ్జ్‌‌గా చేస్తున్నాడు.  జియోహాట్‌‌స్టార్ ఈ షోను  రూపొందిస్తోంది.  హీరోయిన్స్ రాధ, లయ ఈ షోకి జ్యూరీగా ఉన్నారు. శ్రీముఖి యాంకర్‌‌‌‌గా వ్యవహరిస్తోంది. 

శుక్రవారం ఈ షోకి సంబధించిన స్పెషల్ ప్రోమోని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌‌మీట్‌‌లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ఈ షో ఐడియా, కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది.  10 మంది సెలెబ్రిటీ జంటలతో జరుగుతోన్న ఈ షో..  మన లైఫ్ స్టోరీస్‌‌కు ఎమోషనల్‌‌గా కనెక్ట్ అవుతుంది’ అని చెప్పాడు. ఇలాంటి రియాల్టీ షోకు జ్యూరీగా వ్యవహరించడం ఆనందంగా ఉందని రాధ, లయ అన్నారు.