పెద్ద మనసుతో తీసిన చిన్న సినిమా పతంగ్

పెద్ద మనసుతో తీసిన చిన్న సినిమా పతంగ్

ప్రీతి ప‌‌‌‌గ‌‌‌‌డాల‌‌‌‌, ప్రణ‌‌‌‌వ్ కౌశిక్‌‌‌‌, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో ప్రణీత్ ప్రత్తిపాటి  రూపొందించిన చిత్రం ‘పతంగ్’.  సింగర్ ఎస్పీ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.  డి.సురేష్ బాబు సమర్పణలో  విజ‌‌‌‌య్ శేఖ‌‌‌‌ర్ అన్నే, సంప‌‌‌‌త్ మ‌‌‌‌క, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి కలిసి  నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.  రీసెంట్‌‌‌‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

 ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో  వంశీ పూజిత్ మాట్లాడుతూ ‘ట్రైలర్‌‌‌‌లో వున్న పాజిటివ్‌‌‌‌ వైబ్‌‌‌‌ సినిమాలో కూడా ఉంటుంది. పతంగ్‌‌‌‌ పోటీల నేపథ్యంలో కథ ఉంటుంది. యూత్‌‌‌‌ఫుల్‌‌‌‌గా, కలర్‌‌‌‌ఫుల్‌‌‌‌గా  అందర్నీ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌ చేసేలా సినిమా ఉంటుంది’ అని అన్నాడు. ఈ చిత్రంలో నటించడం హ్యాపీ అని ప్రీతి పగడాల చెప్పింది. ప్రణవ్‌‌‌‌ కౌశిక్‌‌‌‌ మాట్లాడుతూ ‘ఈ  సినిమా నాతో పాటు మా అందరికీ  చాలా టఫ్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎమోషనల్‌‌‌‌ జర్నీ.  కైట్స్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌  డ్రామాను తీయడం అంత ఈజీ కాదు.

 తప్పకుండా ఆడియెన్స్‌‌‌‌ను ఆకట్టుకునేలా ఉంటుంది’ అని చెప్పాడు.  రోలర్‌‌‌‌ కోస్టర్‌‌‌‌లా తమ సినిమా నిర్మాణం  జరిగిందని, పతంగ్‌‌‌‌ జర్నీ గ్రేట్‌‌‌‌ జర్నీ అని  నిర్మాత విజయ్‌‌‌‌శేఖర్‌‌‌‌ అన్నారు.  ఆలస్యమయినా  మంచి క్వాలిటీ సినిమా తీశామనే నమ్మకం ఉంది అని  సురేష్‌‌‌‌ కొత్తింటి చెప్పారు.  అందరం కలిసి పెద్ద మనసుతో తీసిన చిన్న సినిమా ఇదని సంపత్ అన్నారు.  ఇతర  నిర్మాతలు నాని బండ్రెడ్డి, రమ్య పాల్గొన్నారు.