'పుష్ప 2'కు ముహూర్తం ఖరారు

'పుష్ప 2'కు ముహూర్తం ఖరారు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అల్లు అర్జున్‌ 'పుష్ప 2' సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రానే వచ్చేసింది. రేపు (సోమవారం) ఈ సినిమా పూజా కార్యక్రమాలను లాంచనంగా నిర్వహించబోతున్నట్లుగా మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ ను కూడా విడుదల చేశారు. ‘పుష్ప: ద రూల్‌’ను పట్టాలెక్కించేందుకు అన్ని సిద్ధం చేశారు. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది.

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. సినిమాలో పాటలు, పలు సన్నివేశాలు, బన్నీ మాస్‌ లుక్‌, మేనరిజం ప్యాన్‌ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అంతకు రెట్టింపు ఉత్సాహం, అంచనాలతో ‘పుష్ప–2’ తెరకెక్కనుంది. ఇక యాక్టర్స్ కు సంబంధించిన విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.