శంబాలతో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం

శంబాలతో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం
  • ఆది సాయికుమార్,  అర్చనా అయ్యర్ జంటగా యుగంధర్ ముని దర్శకత్వంలో 

రాజశేఖర్‌‌‌‌ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మించిన  చిత్రం ‘శంబాల’. డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. హీరోలు  మంచు మనోజ్, కిరణ్ అబ్బవరం, అశ్విన్ బాబు,  ప్రియదర్శి, తమన్, అనిల్ రావిపూడి, నవీన్ యెర్నెని, టీజీ విశ్వ ప్రసాద్,  మైత్రి నిర్మాత నవీన్ యెర్నేని  అతిథులుగా హాజరై ఈ చిత్రానికి పాజిటివ్ వైబ్ కనిపిస్తుందని, కచ్చితంగా హిట్ అవుతుందని అన్నారు. 

ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘గత ఏడాది డిసెంబర్‌‌‌‌లో  ‘శంబాల’ ఫస్ట్ పోస్టర్‌‌‌‌ నుంచి అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. టీజర్‌‌‌‌ను దుల్కర్ గారు రిలీజ్ చేశారు. ప్రభాస్ గారు, నాని గారు రిలీజ్ చేసిన ట్రైలర్‌‌‌‌లు అంచనాల్ని పెంచేశాయి.  థియేటర్లో మా మూవీని చూసిన ఆడియెన్స్  సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ అవుతారు. నేను హిట్టు కొట్టాలని ఎంతగానో ఎదురుచూస్తున్న మా నాన్న కల ఈ  చిత్రంతో కచ్చితంగా నెరవేరుతుంది’ అని అన్నాడు. 

‘ఈ చిత్రంతో  ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, టీంకు విజయోత్సాహం రావాలని కోరుకుంటున్నా’ అని సాయి కుమార్  అన్నారు. ఇది తనకెంతో ప్రత్యేకమైన చిత్రమని హీరోయిన్ అర్చనా అయ్యర్ చెప్పింది. ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందించామని, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని దర్శక నిర్మాతలు అన్నారు.  మూవీ టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.