రియల్ కబడ్డీ ప్లేయర్స్‌‌తో ‘మహిళా కబడ్డీ’ మూవీ

రియల్ కబడ్డీ ప్లేయర్స్‌‌తో ‘మహిళా కబడ్డీ’ మూవీ

ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న  చిత్రం ‘మహిళా కబడ్డీ’.  ఈ చిత్రంలో  ఇండియన్ వుమెన్స్ కబడ్డీ టీమ్ వైస్ కెప్టెన్ పూజ నర్వాల్,  ఇండియన్ కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, హీరో సుమన్, అక్సాఖాన్, తులసితో పాటు ఏడుగురు రియల్ కబడ్డీ ప్లేయర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ అనౌన్స్‌‌మెంట్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘పల్లెటూరి నుంచి వచ్చిన ఒక పేద అమ్మాయి కబడ్డీ ఆటలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా పేరు తెచ్చుకుంది, ఆ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నా’ అని అన్నారు.