వ్యాపారి పీయూష్ జైన్ కు 14 రోజుల జుడీషియల్ కస్టడీ

వ్యాపారి పీయూష్ జైన్ కు 14 రోజుల జుడీషియల్ కస్టడీ
  • 257 కోట్ల నగదు, 23 కిలోల బంగారం, 600 కిలోల వెండి సీజ్

కాన్పూర్: ఉత్తర్ ప్రదేశ్ లో కాన్పూర్ పర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ కు కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించారు. ఈయన ఇంట్లో జీఎస్టీ, ఐటీ అధికారులు  దాడులు చేయగా.. గుట్టల కొద్దీ నోట్ల కట్టలు.. కళ్లు చెదిరేలా బంగారం, వెండి ఆభరణాలు లభించిన విషయం తెలిసిందే. సోదాలు చేసిన అధికారులు నోట్ల గుట్టలు, ఆభరణాలను లెక్కించడానికి 120 గంటలకు పైగా పట్టిన వైనం గురించి మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు ప్రసారం కావడం సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో సైతం ఇదే వార్త వైరల్ అయింది.  ఈ తనిఖీల్లో రూ.194 కోట్లకు పైగా నగదుతోపాటు 23 కిలోల బంగారం, 600కిలోల వెండి సీజ్ చేశారు. ప్రభుత్వానికి భారీ ఎత్తన పన్నులు ఎగ్గొట్టారనే అభియోగంపై పీయూష్ జైన్ ను అరెస్ట్ చేసిన అధికారులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. సంచలనం సృష్టించిన ఈ కేసు నిందితుడికి కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీకి అప్పగించారు. 

 

 

 

 

ఇవి కూడా చదవండి:

తెలంగాణాలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు

రికార్డు స్థాయిలో క్వింటాలు 8515 పలికిన పత్తి ధర

కరెంట్ చార్జీలు పెంచేందుకు విద్యుత్ శాఖ కసరత్తు