భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్ పార్టీకి చెందిన 15 మంది సోమవారం చత్తీస్‌గఢ్‌లోని సుక్మా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఇందులో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారిలో నలుగురిపై రూ.8 లక్షల చొప్పున, ఇద్దరిపై రూ.ఐదు లక్షల చొప్పున రివార్డు ఉందని వెల్లడించారు.
