ఏపీలో కరోనా మృతుల అంత్యక్రియలకు 15వేలు సాయం

 ఏపీలో కరోనా మృతుల అంత్యక్రియలకు 15వేలు సాయం

అమరావతి: కరోనా మహమ్మారితో పోరాడి అశువులు బాసిన వారు సంప్రదాయబద్దంగా అంత్యక్రియలకు నోచుకోవడం లేదన్న ఘటనలపై ఏపీ సర్కార్ స్పందించింది. అంత్యక్రియల ఖర్చుల కింద 15 వేలు తక్షణ సాయం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా ఆదేశాలు కూడా  జారీ చేసింది.కరోనాతో ఎవరైనా చస్తే శవం తీసుకునేందుకు కూడా చాలా చోట్ల ముందుకు రాని ఘటనలతో ఆసుపత్రి వర్గాలు లేదా.. పోలీసులు, మున్సిపల్ సిబ్బందే అంత్యక్రియలు జరపుతున్న ఘటనలు తరచూ జరుగుతున్న విషయం తెలిసిందే.

అంత్యక్రియలకు పీపీఈ కిట్లు కొనుగోలు చేయాల్సి ఉన్నందున అంత ఖర్చు సామాన్యులు భరించలేక చివరి సారిగా ఆస్పత్రిలోనే చూసి మున్సిపలిటీ వారికి అప్పగించి వెళ్తున్నారు. కడసారి వీడ్కోలు కార్యక్రమాలు సైతం జరగని పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం స్పందించి వారి వారి సంప్రదాయం, మతాచారాల ప్రకారం అంత్యక్రియలు జరుపుకునేందుకు వీలుగా 15 వేలు సహాయం ప్రకటించింది.