ట్విట్ట‌ర్ కు పోటీగా థ్రెడ్.. ఫేస్ బుక్ నుంచి కొత్త‌గా.. గంట‌ల్లోనే మిలియ‌న్ డౌన్ లోడ్స్

ట్విట్ట‌ర్ కు పోటీగా థ్రెడ్.. ఫేస్ బుక్ నుంచి కొత్త‌గా.. గంట‌ల్లోనే మిలియ‌న్ డౌన్ లోడ్స్

థ్రెడ్స్ .. మెటా తీసుకువచ్చిన కొత్త ప్లాట్‌ఫారమ్. దీన్ని ప్రారంభించిన నాలుగు గంటల్లోనే 5 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. "మొదటి రెండు గంటల్లోనే థ్రెడ్స్ 2 మిలియన్లకు పైగా సైన్ అప్‌లను అందుకుంది" అని మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ పోస్ట్ చేశారు. "మొదటి నాలుగు గంటల్లో కేవలం 5 మిలియన్ల సైన్ అప్‌లను ఆమోదించింది..." అని ఓ అప్‌డేట్‌లో పోస్ట్ లో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో థ్రెడ్స్ .. ట్విట్టర్‌ని మించిపోతుందా అన్న దానిపై చర్చ మొదలైంది. మరికొందరేమో ఇన్‌స్టాగ్రామ్ లాంటి విజువల్ ప్లాట్‌ఫారమ్‌ను భర్తీ చేయడం కష్టమని భావిస్తున్నారు.

థ్రెడ్స్ ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్ ఉంటే.. అంటే మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఇప్పటికే వెరిఫైడ్ అయి ఉంటే.. థ్రెడ్స్‌ యాప్‌లోనూ అకౌంట్‌ ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ అవ్వొచ్చు. యాప్‌ను యాపిల్‌ స్టోర్‌ నుంచి సైతం ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. థ్రెడ్‌ యాప్‌లో ఇన్ స్టాగ్రామ్ ఐడీతో లాగిన్ చేసుకోవచ్చు. మెటా ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఫొటో షేరింగ్ మల్టీమీడియా ప్లాట్‌ఫారమ్. అయితే థ్రెడ్స్‌ ట్విట్టర్ మాదిరిగానే టెక్స్ట్‌ ఆధారిత సోషల్ మీడియా యాప్‌. ప్రస్తుతం ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్న వారికి.. థ్రెడ్స్‌ను వాడడంలో ఎలాంటి సమస్యలుండవు.

ఒక రకంగా చెప్పాలంటే ఇది ట్విట్టర్ పాత వెర్షన్ లాగా ఉంటుంది. థ్రెడ్స్‌లో వెబ్ లింక్‌లు, ఫొటోలు (ఒకేసారి గరిష్టంగా 10ఫొటోలు) వీడియోలను, 500 వరకు వర్డ్స్‌ను పోస్ట్‌ చేయవచ్చు. అలాగే ఎవరినైనా బ్లాక్ చేయడంతో పాటు ఫాలో కూడా కావొచ్చు. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరినైనా బ్లాక్‌ చేసి ఉంటే.. థ్రెడ్స్‌లో సైతం ఆ అకౌంట్స్‌ బ్లాక్‌ లిస్ట్‌లో ఉంటాయి. ఇక రీసెంట్ గా అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ప్రారంభించిన కొద్ది గంటల్లోనే రెండు మిలియన్లకుపైగా యూజర్లు థ్రెడ్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.