Actor Achyut Potdar: చికిత్స పొందుతూ ప్రముఖ నటుడు కన్నుమూత.. 125కి పైగా సినిమాల్లో తనదైన ముద్ర

Actor Achyut Potdar: చికిత్స పొందుతూ ప్రముఖ నటుడు కన్నుమూత.. 125కి పైగా సినిమాల్లో తనదైన ముద్ర

ప్రముఖ సీనియర్ మరాఠీ నటుడు అచ్యుత్ పోత్దార్ (91) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు నటుడు అచ్యుత్. ఈ క్రమంలో సోమవారం (ఆగస్ట్ 18న) ఆయన థానేలోని జూపిటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ (ఆగస్టు 19న) థానేలో జరగనున్నాయి. 

40 సంవత్సరాలుగా, అచ్యుత్ అనేక హిందీ మరియు మరాఠీ చిత్రాలతో పాటు టెలివిజన్ షోలలో నటించడం ద్వారా తనదైన ముద్ర వేశారు. దాదాపు 125 కి పైగా చిత్రాల్లో నటించారు. ఆమిర్ ఖాన్ 3 ఇడియట్స్ లో నటుడు అచ్యుత్ ప్రొఫెసర్ గా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సల్మాన్ ఖాన్ దబాంగ్ 2, పరిణీత, రంగీలా, దిల్ వాలే, లగేరహో, మున్నాభాయ్, వాస్తావ్ వెంటిలేటర్ వంటి చిత్రాల్లో నటించి బాగా గుర్తింపు పొందారు అచ్యుత్.

►ALSO READ | భార‌త సినిమా రంగానికి హైదరాబాద్‎ను కేంద్రంగా నిలపాలి: సీఎం రేవంత్ రెడ్డి

అలాగే, వాగ్లే కి దునియా, మజా హోషీల్ నా, మిసెస్ టెండూల్కర్, భారత్ కీ ఖోజ్ వంటి ప్రముఖ టెలివిజన్ షోలలో కూడా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో మరాఠీ GEC టీవీ ఛానెళ్లతో పాటు, బాలీవుడ్ సినీ పరిశ్రమ సోషల్ మీడియా ద్వారా దివంగత నటుడికి నివాళులు అర్పిస్తున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Star Pravah (@star_pravah)