తెలంగాణలో సినీ ప్రభంజనం పెరిగింది: మురళీధర్ రావు

తెలంగాణలో సినీ ప్రభంజనం పెరిగింది: మురళీధర్ రావు

తెలంగాణ ప్రభుత్వం విక్రమాదిత్య నాటక ప్రదర్శనను ప్రోత్సహించాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు కోరారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ జీడిమెట్ల హెచ్ఎంటి గ్రౌండ్ లో సామ్రాట్ విక్రమాదిత్య మహా నాటక ప్రదర్శన జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మూడోవ రోజు నాటక ప్రదర్శనను మురళీధర్ రావు ప్రారంభించారు. మూడు రోజుల పాటు నాటక ప్రదర్శన ఏర్పాటు చేశామని.. పద్దతిగా ఈ నాటక ప్రదర్శన జరుగుతుందని ఆయన వెల్లడించారు. భారత దేశ గొప్ప తనాన్ని, సాంసృతిని ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలన్నారు.

తెలంగాణలో సినీ ప్రభంజనం పెరిగిందన్న మురళీధర్ రావు.. నాటక ప్రదర్శలు చాలా తగ్గాయన్నారు. ప్రస్తుత తరానికి నాటకల గురించి తెలియదని చెప్పారు. ప్రధాన మంత్రి మోడీ ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈ నాటక ప్రదర్శన జరుగుతుందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం విక్రమాదిత్య చరిత్రను అన్ని రాష్ట్రాలకు తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు. మన రాజుల చరిత్రను మనం తెలుసుకోవాలని..2000 ఏండ్ల క్రితం విక్రమాదిత్య శకం నడిచిందని గుర్తు చేశారు. విక్రమాదిత్య బేతాల కథలు పుస్తకాల్లో చూశామని.. విక్రమాదిత్య గొప్పతనం ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలన్నారు.