స్కూల్స్ కు 6 వేల ఫుట్ బాల్స్ ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం

  స్కూల్స్ కు 6 వేల ఫుట్ బాల్స్ ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం

స్కూల్ కు వెళ్తున్న పిల్లల్లో క్రీడలను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న అధ్యాయానికి శ్రీకారం చుట్టుంది. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్, కేంద్ర ప్రభుత్వం  కలిసి ఒడిషాలోని 1 వెయ్యి 260 పాఠశాలలకు 6 వేల 848 ఫుట్‌బాల్‌లను పంపీణీ చేశారు. విద్యార్థుల్లో ఫుట్ బాల్ క్రీడను మరింత మెరుగు మెరుగుపరచడానికి ఈ విధంగా పంపీణీ చేస్తున్నామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 

ALSO READ :- తెలంగాణలో పలుచోట్ల వర్షాలు..

ఒడిశాలోని 17 జిల్లాల్లోని పాఠశాలలకు 6 వేల 848 ఫుట్‌బాల్‌లు పంపిణీ చేశామని అన్నారు. దేశవ్యాప్తంగా 1 లక్ష 50 వేల పాఠశాలలకు 11 లక్షలకు పైగా FIFA ఫుట్‌బాల్‌లను క్రమంగా పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఫుట్ బాల్ ఆటను దేశంలోని పిల్లలందరికి దగ్గర చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.