పసిపాపను ట్రాక్టర్ టైర్ కింద పడేసిన మహిళ

పసిపాపను ట్రాక్టర్ టైర్ కింద పడేసిన మహిళ

ఉత్తర ప్రదేశ్‌: అన్నదమ్ముల భూమి గొడవ కారణంగా అభంశుభం ఎరుగని చిన్నారి ప్రాణాలు పోతుండే. తన భూమిని దున్నేముందు నా బిడ్డను చంపుకుంటూ వెళ్లమని ఓ మహిళ సడెన్ గా ట్రాక్టర్ టైర్ కింద పాపను పడేసింది. సెకన్లపాటు ఆలస్యమైన ఆ పసిబిడ్డ  మీదినుంచి ట్రాక్టర్ ఎక్కేది. పాప చనిపోయేది. ఈ ఘటన యూపీలో జరుగగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లా, లాలే మౌ గ్రామానికి చెందిన అన్నాదమ్ముల మధ్య పొలం పంపకాల విషయంపై వివాదం నెలకొంది. అయితే వారిలో ఒకరు తన ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నేందుకు ఆదివారం ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ ట్రాక్టర్‌ను ఆపేందుకు వారిలో ఒకరి భార్య ప్రయత్నించింది. తన చేతుల్లో ఉన్న పాపను ట్రాక్టర్‌ టైర్‌ ముందు పడేసింది.  అయితే ట్రాక్టర్‌ నడుపుతున్న వ్యక్తి వెంటనే బ్రేకులు వేయడంతో ఆ పసి పాపకు ప్రమాదం తప్పింది. ఆ తర్వాత  మహిళ పాపను తీసుకుని ఎత్తుకుంది. ట్రాక్టర్‌పై ఉన్న వ్యక్తితో ఘర్షణకు దిగింది. చిన్నారికి కనీసం బట్టులు కూడా వేయలేదు. ఒక్కసారిగా భయంతో కేకలు వేసిన పసిపాపను పట్టించుకోకుండా గొడవకు దిగిందామె. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒకరు మొబైల్‌లో ఈ వీడియోను రికార్డు చేయడంలో ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ మహిళ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆస్తి గొడవలుంటే పెద్ద మనుషులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలి కానీ.. ఇలా చిన్నారిని చంపుకుంటారా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కొంచెమైతే పాపం పాప చనిపోయేదని.. అంత నిర్లక్ష్యంగా ఎలా టైర్ కింద పడేస్తుందని ప్రశ్నిస్తున్నారు. వీడియో చూస్తుంటేనే తట్టుకోలేక పోతున్నామని.. కన్నతల్లి అయి ఉండి ఇంతటి దారుణానికి పాల్పడిందా అని కామెంట్స్ చేస్తున్నారు. అంతలా ఉంటే ఆమె టైర్ కింద పడాల్సింది అని మరికొందరు ట్వీట్స్ వదులుతున్నారు. సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో దీనిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని గోండా ఎస్పీ ఆకాష్ తోమర్ తెలిపారు.