రామ్ వారియర్ లో ఆది పినిశెట్టి లుక్

రామ్ వారియర్ లో ఆది పినిశెట్టి లుక్

హీరో పాత్రలకే పరిమితమవ్వకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌‌గాను, విలన్‌‌‌‌గాను కూడా సత్తా చాటుతున్నాడు ఆది పినిశెట్టి.  ‘సరైనోడు’ చిత్రంలో క్లాస్‌‌‌‌ లుక్‌‌‌‌లో కనిపిస్తూనే విలనీని అదరగొట్టాడు. ఇప్పుడు రామ్‌‌‌‌ని ఢీ కొట్టడానికి ఫుల్‌‌‌‌ మాస్‌‌‌‌ లుక్‌‌‌‌లోకి మారిపోయాడు. లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ‘వారియర్’ చిత్రంలో గురు అనే పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ విలన్‌‌‌‌ రోల్‌‌‌‌ చేస్తున్నాడు ఆది. నిన్న మహా శివరాత్రి సందర్భంగా ఫస్ట్‌‌‌‌లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘మీట్ అవర్ మైటీ గురు’ అంటూ తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ని పరిచయం చేశారు. రింగులు తిరిగిన జుట్టు.. మెడలో తాయెత్తు.. లుంగీ.. కుర్తా.. చేతికి కడియం.. కళ్లలో కోపం.. నుదుటన ముడతలు.. చెంపలపై కత్తి గాట్లు.. చూడటానికే చాలా వయొలెంట్‌‌‌‌గా ఉన్నాడు ఆది. ఇందులో రామ్ పవర్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌ పోలీసుగా నటిస్తున్నాడు. అతనికి దీటుగా నిలబడే శత్రువుగా ఆది కనిపిస్తాడు. కృతీశెట్టి, అక్షర గౌడ హీరోయిన్స్. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.