సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏసీబీ తనిఖీలు

సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏసీబీ తనిఖీలు

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: జయశంకర్​ భూపాలపల్లి సబ్​ రిజిస్టర్​ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ ఆఫీసర్లు ఆకస్మికంగా దాడులు చేపట్టారు. ఏసీబీ డీఏస్పీ సాంబయ్య నేతృత్వంలో జిల్లా కేంద్రంలోని మంజూర్​నగర్​ ఏరియాలోని సబ్​రిజిస్టర్​ ఆఫీసులో సోదాలు జరిగాయి. 

అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ డీఏస్పీ సాంబయ్య తెలిపారు. ఈ క్రమంలో రెండు గంటల పాటు ఆఫీసులోని  డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేశారు. ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను పలు అంశాలపై ప్రశ్నించారు.