మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కు ప్రమాదం

మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కు ప్రమాదం
  • అడవి పందులను తప్పించబోయి సడెన్ బ్రేక్
  • రెండు కార్లు అదుపతప్పి ఢీ.. మంత్రి హరీష్ రావు సురక్షితం

సిద్దిపేట: మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది. కొండపాక మండలం దుద్దేడ సమీపంలో అడవి పందులను తప్పించబోయి మంత్రి హరీష్ రావు కాన్వాయిలో ఒక కారు ప్రమాదానికి లోనైంది. మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పిపోయింది. మంత్రి హరీష్ రావు సిద్దిపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం  జరిగింది. 
హరీష్ రావు కాన్వాయి ముందు వెళ్తున్న కారుకు అడవి పందులు అడ్డువచ్చినట్లు తెలుస్తోంది. ముందు కారు డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేయడంతో  ఆకారును వెనుక నుంచి ఢీకొట్టింది. హరీష్ రావు కారు ముందు వెళ్తున్న పైలెట్ కారును ఢీకొట్టినట్లు సమాచారం. కారు ముందు భాగం కొంత ధ్వంసం అయింది. ముందు కారులోని ఒకరికి స్వల్పగాయాలు అయ్యాయి. గాయాలయిన వ్యక్తిని ఆసుపత్రికి పంపించిన హరీష్ రావు మరో కారులో హైద్రాబాద్ కు వెళ్లిపోయారు.