40 అడుగుల గోడ దూకి.. జైలు నుంచి తప్పించుకున్న రేప్ కేసు నిందితుడు..

40 అడుగుల గోడ దూకి.. జైలు నుంచి తప్పించుకున్న రేప్ కేసు నిందితుడు..

అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ 23 ఏళ్ల ఖైదీ 40 అడుగుల ఎత్తులో ఉన్న జైలు కాంపౌండ్ వాల్ దూకి తప్పించుకున్నాడు.  దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. 

దీంతో పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.  నిందితుడిని కుమార్ గా గుర్తించారు. ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరె సబ్ జైలులో చోటుచేసుకుంది. 

40 అడుగుల ఎత్తులో ఉన్న జైలు కాంపౌండ్ వాల్ దూకిన నిందితుడికి గాయలయ్యాయి.  కాసేపటి తర్వాత మెల్లిగా లేచి అక్కడి నుంచి కుంటుతూనే వెళ్లాడు. అక్కడ ఓ రిక్షాను పట్టుకుని బయటకు వెళ్లిపోయాడు.  

తప్పించుకున్న నిందితుడు కుమార్ కరూర్ ప్రాంతానికి చెందినవాడని, దావణగెరె మహిళా పోలీస్ స్టేషన్‌లో2023  ఆగస్టులో అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.  

పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు తప్పించుకున్నందుకు సంబంధించి బసవనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని  పోలీసులు వెల్లడించారు.