
మెగాస్టార్ చిరంజీవి, సంగీత దర్శకుడు మణిశర్మ కాంబినేషన్‌లో ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్స్ వచ్చాయి. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్‌లో మణిశర్మ బీట్‌కు తగ్గట్టు చిరంజీవి వేసే డ్యాన్స్ మూమెంట్స్ ఓ రేంజ్‌లో మెప్పించాయి. కొంత గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చి మెప్పించాయి. న్యూ ఇయర్ సందర్భంగా మూడో పాటను నిన్న విడుదల చేశారు. ‘శానా కష్టం వచ్చిందే మందాకినీ’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌ని రేవంత్, గీతామాధురి పాడారు. భాస్కరభట్ల లిరిక్స్ రాశారు.
ఈ ఐటమ్ సాంగ్‌లో చిరంజీవితో కలిసి స్టెప్పులేసింది రెజీనా. తన గ్లామర్‌తో పాటు చిరంజీవి మార్క్ మాస్ స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. చరణ్‌కి జంటగా పూజాహెగ్డే కనిపించనుంది. దేవాదాయ శాఖకు సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌లో కొరటాల శివ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్‌చరణ్ నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 4న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.