
బుల్లితెర నుంచి వెండితెరపైకి అడుగుపెట్టి.. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి మృణాల్ ఠాకూర్. 'కుంకుమ్ భాగ్య' వంటి సీరియల్స్‌తో ఇంటెలిజెంట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. 2018లో 'లవ్ సోనియా'తో బాలీవుడ్‌లో, 2022లో 'సీతా రామం'తో తెలుగులో అరంగేట్రం చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. తన సినిమా ఎంపికల్లో ఎప్పుడూ విలక్షణతను చూపిస్తుంది బ్యూటీ. ప్రస్తుతం సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
విరాట్ కోహ్లీపై క్రష్,
కొన్నేళ్ల క్రితం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారాయి. మృణాల్ ఠాకూర్ తాను టీనేజ్‌లో ఉన్నప్పుడు క్రికెటర్ విరాట్ కోహ్లీపై విపరీతమైన క్రష్ ఉండేదని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన సోదరుడు క్రికెట్ అభిమాని కావడంతో తాను కూడా క్రికెట్‌ను ఇష్టపడటం మొదలుపెట్టానని తెలిపింది. ఐదేళ్ల క్రితం ఒకసారి స్టేడియంలో నేను బ్లూ జెర్సీ వేసుకుని టీమ్ ఇండియాలను ప్రోత్సహించాను . జెర్సీ వంటి క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఇది ఒక హ్యాపీ కో-ఇన్సిడెన్స్ అని తెలిపింది.
వైరల్ అయిన వ్యాఖ్యలు
ఈ వ్యాఖ్యలను 2024లో ఒక న్యూస్ పోర్టల్ మళ్లీ ప్రచురించడంతో, కోహ్లీ ఫోటోతో కూడిన ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ పోస్ట్‌పై మృణాల్ "STOP IT OK" అని కామెంట్ చేయడంతో.. ఆన్‌లైన్‌లో పెద్ద చర్చ కు దారితీసింది. ఆమె ఆ వ్యాఖ్యలపై కోపంగా ఉందా, ఇబ్బంది పడుతోందా, లేక సరదాగా అలా స్పందించిందా అని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకున్నారు. మృణాల్ నిజాయితీతో కూడిన ఈ చిన్న రిప్లై, ఆమె వ్యక్తిత్వంపై అభిమానులకు మరింత స్పష్టతనిచ్చింది.
'సుల్తాన్' ఆఫర్ తిరస్కరణ
తన కెరీర్ ఎంపికల విషయంలో ఎప్పుడూ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది మృణాల్ ఠాకూర్. ఒక ఇంటర్వ్యూలో ఆమె, తనకు వచ్చిన చాలా సినిమాలను రిజెక్ట్ చేశానని, ఎందుకంటే ఆ పాత్రలకు తాను సిద్ధంగా లేనని కాబట్టి అని చెప్పింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ నటి చాలా ఎదిగింది. కానీ అప్పుడు నేను ఆ సినిమా చేసి ఉంటే.. నన్ను నేను కోల్పోయేదాన్ని అని ఆమె తెలిపింది.
అనుష్క శర్మపైనేనా?
ప్రస్తుతం ఆమె పనిచేయడం లేదు, కానీ నేను పని చేస్తున్నాను. ఇది నాకు ఒక విజయం. తక్షణ కీర్తి, గుర్తింపు నాకు అవసరం లేదు మృణాల్ స్పష్టం చేసింది. ఏది త్వరగా వస్తుందో అది అంతే త్వరగా పోతుంది అని చెప్పింది. అయితే సల్మాన్ ఖాన్ సరసన 'సుల్తాన్' సినిమాలో అవకాశం మొదట మృణాల్‌కు వచ్చినా.. ఆ పాత్ర తర్వాత అనుష్క శర్మకు దక్కిందని బాలీవుడ్ లో టాక్. అటు ఈ వ్యాఖ్యలు అనుష్క శర్మను ఉద్దేశించే మృణాల్ ఠాకూర్ మాట్లాడిందని నెటిజన్లు భావించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మృణాల్ గతంలో మాట్లాడిన మాటలు ఇటీవల తెగ హల్ చల్ చేస్తున్నాయి. మరి వీటిపై ఈ బ్యూటీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.