
ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమకాలీన అంశాలపై రియాక్ట్ అయ్యే హీరోయిన్ పూనమ్ కౌర్ గణేష్ చతుర్థి సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలంటూ ట్వీట్ చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తే ఏళ్ల తరబడి పెరుగుతున్న నేరాల రేటు తగ్గుతుందని తన ట్వీట్ లో తెలిపింది.
If passing the #womensreservationbill will reduce the crime rate which has been increasing over the years - I pray this Ganesh Chaturthi that this should be passed unanimously keeping in mind to be used rightfully for all sections of the society, beyond political greed or glory🙏
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 18, 2023
అంతేకాకుండా - రాజకీయ దురాశకు, కీర్తికి అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయంగా ఉపయోగపడేలా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని ఈ గణేష్ చతుర్థిని ప్రార్థిస్తున్నానంటూ అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. ఆమె చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ: రెండో పెళ్లిపై ఒత్తిడి పెరిగింది.. క్లారిటీ ఇచ్చిన మీనా
కాగా మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో కొంత కాలంగా పెండింగ్‌లో ఉంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెల 20న మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.