పాల్వంచ మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ ​చేయాలి : అడిషనల్​కలెక్టర్ వేణుగోపాల్​

పాల్వంచ మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ ​చేయాలి : అడిషనల్​కలెక్టర్ వేణుగోపాల్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ధాన్యం కొనుగోళ్లను స్పీడప్​ చేయాలని అడిషనల్​ కలెక్టర్​డి.వేణుగోపాల్​ఆఫీసర్లను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం పౌరసరఫరాల శాఖాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. తాగునీరు, టెంట్లు, తేమ శాతం కొలిచే మిషన్లు, గన్నీ బ్యాగ్స్, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు ఎప్పటికప్పుడు తరలించాలన్నారు.

.
కుర్నవల్లిలో ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ తనిఖీ

తల్లాడ:  తల్లాడ మండలం కుర్నవల్లిలో ధాన్య కొనుగోలు కేంద్రాన్ని  ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అనంతరం ఎంపీడీఓ ఆఫీసులో కల్లూరు డివిజన్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. మిల్లర్లు కేటాయించిన లక్ష్యం మేరకు ధాన్యం దిగుమతి చేసుకోవాలని చెప్పారు. 

ధాన్యం అన్​లోడింగ్ వెంటవెంటనే జరిగేలా సరిపోను హమాలీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, కల్లూరు ఆర్డీవో ఏ. రాజేందర్ గౌడ్, తల్లాడ తహసీల్దార్ సురేశ్​కుమార్, పౌరసరఫరాల ఆర్ఐలు పాల్గొన్నారు.