
రెస్టారెంట్ నడపడం అంటే ఇంటికి వచ్చిన గెస్ట్‌లకు మర్యాద చేసి, వాళ్లకు మంచి ఫుడ్ పెట్టడం లాంటిదే. ఇలా మర్యాదగా రిసీవ్ చేసుకుని, స్పెషల్ ఫుడ్‌ను అందించే ఫేమస్ రెస్టారెంట్ ‘నోమా’. మళ్లీ తన క్రెడిబిలిటీ నిలుపుకుంది. ప్రపంచంలోని 50 బెస్ట్ రెస్టారెంట్లలో టాప్‌లో నిలిచింది నోమా. డెన్మార్క్‌లోని కోపెన్హెగన్లో ఉంది నోమా రెస్టారెంట్. దీన్ని 2003లో చెఫ్ ‘రేనె రెడ్జెపీ’ స్టార్ట్ చేశాడు. తొలి రోజుల్లోనే నోమా కోపెన్హెగన్లో బెస్ట్ రెస్టారెంట్‌గా పేరు తెచ్చుకుంది. సీ ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్‌కు నోమా పెట్టింది పేరు. అక్కడ దొరికే క్లౌడ్ బెర్రీ ఫ్లవర్స్‌తో చేసే వంటలు, రెయిన్ డీర్ మీట్ ఫుడ్ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తాయి. అలాగే ఇంటర్నేషనల్ ఫుడ్ మెను కూడా అట్రాక్ట్ చేస్తుంది. వంట చేయడమే కాదు దాన్ని వడ్డించడంలో కూడా స్పెషాలిటీ ఉంది ఇక్కడ. బెస్ట్ హాస్పిటాలిటీ, సర్వింగ్, స్టాండర్డ్ కుషన్ సిస్టమ్ ఉండటంతో ఈ రెస్టారెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ రెస్టారెంట్ వరల్డ్ బెస్ట్ రెస్టారెంట్‌గా రికార్డును కంటిన్యూ చేస్తోంది. 2011 తర్వాత ఫౌండర్ రేనె రెడ్జెపీ ఎన్నో మార్పులు చేశాడు. కల్చర్, నేచర్ బేస్డ్ ఫుడ్‌ను వండటం స్టార్ట్ చేశాడు. గత పద్దెనిమిది సంవత్సరాల్లో ఆరు సార్లు నోమా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. కరోనాకు ముందు, తర్వాత చేసిన ప్రత్యేక మార్పుల వల్ల డెన్మార్క్‌లో ఎక్కువ మంది వచ్చిన రెస్టారెంట్‌గా కూడా నోమా రికార్డు సృష్టించింది. అలాగే ‘మిషెలిన్ స్టార్’ గుర్తింపును ఈ ఏడాది సెప్టెంబర్‌లో తెచ్చుకుంది.