ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లను బాగుచేయాలి : కలెక్టర్ రాజర్షి షా

ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లను బాగుచేయాలి : కలెక్టర్ రాజర్షి షా
  • కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు, చెరువుల పరిసర ప్రాంతాలకు వెంటనే రిపేర్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదిలాబాద్​కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ, నీటిపారుదల శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. 

వరదల ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తాత్కాలిక, శాశ్వత పరిష్కార మార్గాలపై చర్చించారు. స్థానిక మావల చిన్న చెరువు, ఖానాపూర్​చెరువులో భారీ వర్షాలతో ఏర్పడిన సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వెంటనే చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, నీటి పారుదలశాఖ అధికారులు విఠల్ తదితరులు పాల్గొన్నారు.