
తనకు వారణాసి ప్రజలపై ఎక్కువ నమ్మకమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కాశీ కొత్త కారిడార్ ను ప్రారంభించిన మోడి.. కాశీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హర హర మహాదేవ్ అనే నినాదాంతో మోడీ స్పీచ్ స్టార్ట్ చేశారు. ఈ కారిడార్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.. కాశీ విశ్వనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు. శివుడి ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు, ఈ కారిడార్ కూడా అలాగే జరిగిందన్నారు. కాశీలో అడుగుపెట్టగానే ప్రత్యేక అనుభూతి కల్గుతుందన్నారు. తన కంటే వారణాసి ప్రజలపై నమ్మకం ఎక్కువన్నారు. కాశీ విశ్వనాథ కారిడార్ కు అందరికీ స్వాగతం చెప్పారు. విశ్వనాథుని దర్శనం త్వరగా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎన్ని తరాలైనా కాశీ అందరిలో స్ఫూర్తి నింపుతుందన్నారు. మందిర పునర్నిర్మాణం చేసిన అహల్యాబాయిని అభినందించారు. ప్రాచీన వైభవాన్ని ఈ కారిడార్ కళ్లకు కడుతుందన్నారు. కారిడార్ నిర్మాణంలో శ్రామికుల కష్టం వెలకట్టలేనిదన్నారు.
#WATCH | Varanasi: After inaugurating Kashi Vishwanath Corridor, PM Narendra Modi starts his address with the chant of 'Har Har Mahadev'
— ANI UP (@ANINewsUP) December 13, 2021
(Source: DD) pic.twitter.com/JlrDIF9adC