కుక్కల దాడిలో బాలుడు మృతి ..మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో దారుణం

కుక్కల దాడిలో బాలుడు మృతి ..మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో దారుణం

శివ్వంపేట, వెలుగు : బిస్కెట్స్‌‌ కొనుక్కుందామని బయటకు వెళ్లిన నాలుగేండ్ల బాలుడిపై కుక్కలు దాడి చేయడంతో చనిపోయాడు. ఈ ఘటన మెదక్‌‌ జిల్లా శివ్వంపేట మండలంలోని రూప్లాతండాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... తండాకు చెందిన జేరుపుల లావణ్య కుమారుడు నితిన్‌‌ (4) శుక్రవారం బిస్కెట్స్‌‌ కొనుక్కునేందుకు షాప్‌‌కు వెళ్లాడు. తిరిగి వస్తుండగా... నితిన్‌‌పై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తండాకు చెందిన శారద, బుజ్జి గమనించి కుక్కలను తరిమికొట్టి నితిన్‌‌ తల్లి లావణ్యకు విషయం చెప్పారు. ఆమె ఘటనాస్థలానికి చేరుకొని బాలుడిని నర్సాపూర్‌‌ ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించింది. అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ నితిన్‌‌ చనిపోయాడు.