టాపార్డర్‌‌‌‌ కొలాప్స్‌‌‌‌.. క్లాసిక్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో ఆదుకున్న అగర్వాల్

టాపార్డర్‌‌‌‌ కొలాప్స్‌‌‌‌.. క్లాసిక్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో ఆదుకున్న అగర్వాల్
  • సెంచరీతో ఆదుకున్న అగర్వాల్
  • ఇండియా 221/4
  • అజాజ్ కు 4 వికెట్లు

ముంబై:  టీమ్‌‌‌‌లో తన ప్లేస్‌‌‌‌ను కాపాడుకోవాలంటే  కచ్చితంగా భారీ ఇన్నింగ్స్‌‌‌‌ ఆడాల్సిన వేళ యంగ్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌ మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ (246 బాల్స్‌‌‌‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 120 బ్యాటింగ్​) తన టాలెంట్ చూపెట్టాడు. టాపార్డర్‌‌‌‌ సడన్‌‌‌‌గా కొలాప్స్‌‌‌‌ అయిన టైమ్​లో.. ఫుల్‌‌‌‌ ప్రెజర్‌‌‌‌లో.. క్లాసిక్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో టీమ్‌‌‌‌ను ఆదుకున్నాడు.  మయాంక్‌‌‌‌ సూపర్‌‌‌‌ సెంచరీ కొట్టడంతో న్యూజిలాండ్‌‌‌‌తో శుక్రవారం మొదలైన సెకండ్‌‌‌‌ టెస్టులో ఇండియా 221/4 స్కోరుతో ఫస్ట్ డేను సానుకూలంగా ముగించింది. . మరో ఓపెనర్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (44) కూడా రాణించాడు. అయితే, న్యూజిలాండ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ అజాజ్‌‌‌‌ పటేల్‌‌‌‌ (4/73).. రెండు ఓవర్ల తేడాతో గిల్‌‌‌‌తో పాటు పుజారా (0), విరాట్ కోహ్లీ (0)ని డకౌట్‌‌‌‌ చేయడంతో 80/3తో ఇండియా కష్టాల్లో పడ్డది. ఈ టైమ్‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (18)తో  ఫోర్త్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 80, సాహా (25 బ్యాటింగ్‌‌‌‌)తో ఐదో వికెట్‌‌‌‌కు 61 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌తో మయాంక్ ఇండియాను నిలబెట్టాడు. కాగా, రెండు రోజుల వాన వల్ల ఔట్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ తడిగా ఉండటంతో ఫస్ట్‌‌‌‌ సెషన్‌‌‌‌ రద్దయింది. లంచ్‌‌‌‌ తర్వాత ఆట మొదలవగా ఫస్ట్‌‌‌‌ డే 70 ఓవర్లు పడ్డాయి. సెకండ్‌‌‌‌ డే మార్నింగ్‌‌‌‌ సెషన్‌‌‌‌ ఆట మ్యాచ్‌‌‌‌కు కీలకం కానుంది.

ఇటు అగర్వాల్‌‌‌‌... అటు అజాజ్‌‌‌‌
ఫస్ట్‌‌‌‌ డే ఆటలో ఇండియా నుంచి మయాంక్‌‌‌‌, కివీస్‌‌‌‌ ప్లేయర్లలో అజాజ్‌‌‌‌ పటేల్‌‌‌‌ హైలైట్‌‌‌‌గా నిలిచారు.  వాస్తవానికి ఈ మ్యాచ్‌‌‌‌కు  కోహ్లీ తిరిగి రావడంతో మయాంక్‌‌‌‌ను తీసేస్తారన్న చర్చ జరిగింది. కానీ, గాయం పేరుతో రహానెను పక్కనబెట్టిన మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌గా మయాంక్‌‌‌‌ను కొనసాగించింది. ఇలాంటి టైమ్‌‌‌‌లో చాలా ప్రెజర్‌‌‌‌ ఉన్నప్పటికీ మయాంక్‌‌‌‌ ఎలాంటి టెన్షన్‌‌‌‌ లేకుండా బ్యాటింగ్‌‌‌‌ చేశాడు. సెలక్టర్లు, టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ తనను పక్కనపెట్టలేని సిచ్యువేషన్‌‌‌‌ తీసుకొచ్చాడు. టాస్‌‌‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఇండియాకు గిల్‌‌‌‌తో కలిసి మంచి స్టార్టింగ్‌‌‌‌ ఇచ్చాడు. ఇద్దరూ సాలిడ్‌‌‌‌ షాట్లతో బౌండ్రీలు కొట్టారు. స్టార్టింగ్‌‌‌‌లో గిల్‌‌‌‌ కాస్త స్పీడ్‌‌‌‌గా ఆడాడు. జెమీసన్‌‌‌‌ వేసిన రెండో ఓవర్లోనే ఆన్‌‌‌‌డ్రైవ్‌‌‌‌, కవర్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌, లెగ్‌‌‌‌ ఫ్లిక్‌‌‌‌తో మూడు ఫోర్లు కొట్టాడు. అజాజ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో క్రీజుముందుకొచ్చి సిక్స్‌‌‌‌ కొట్టిన మయాంక్‌‌‌‌.. మరో స్పిన్నర్‌‌‌‌ సోమర్‌‌‌‌విల్లే (0/46) బౌలింగ్‌‌‌‌లోనూ ఇంకో సిక్సర్‌‌‌‌ బాదాడు. మధ్యలో కాస్త స్లో అయినా సోమర్‌‌‌‌విల్లే ఓవర్లో రెండు ఫోర్లతో గిల్‌‌‌‌ మళ్లీ జోరు పెంచాడు. కానీ, తర్వాతి ఓవర్లోనే అతడిని ఔట్‌‌‌‌ చేసిన అజాజ్‌‌‌‌ కివీస్‌‌‌‌కు ఫస్ట్ బ్రేక్‌‌‌‌ ఇచ్చాడు. ముందు డెలివరీకే స్టంపౌట్‌‌‌‌ అయ్యే ప్రమాదం తప్పించుకున్న గిల్‌‌‌‌.. అజాజ్‌‌‌‌ టర్నింగ్‌‌‌‌ బాల్‌‌‌‌ను డ్రైవ్‌‌‌‌ చేయబోయి స్లిప్‌‌‌‌లో టేలర్‌‌‌‌కు చిక్కాడు.  తన తర్వాతి ఓవర్లోనే అజాజ్‌‌‌‌ ఇండియాను దెబ్బకొట్టాడు. అద్భుతమైన బాల్‌‌‌‌తో పుజారాను క్లీన్‌‌‌‌బౌల్డ్‌‌‌‌ చేసిన తను కోహ్లీని ఎల్బీగా వెనక్కుపంపాడు. దాంతో, ఇండియాపై ప్రెజర్‌‌‌‌ పెరిగింది.  అయితే, అజాజ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లోనే వరుసగా 6, 4తో  మయాంక్‌‌‌‌ కౌంటర్‌‌‌‌ ఇచ్చాడు. లాస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ హీరో శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ నిలకడగా ఆడగా... సెషన్‌‌‌‌ చివర్లో అగర్వాల్‌‌‌‌ ఫిఫ్టీ కంప్లీట్‌‌‌‌ చేసుకున్నాడు. ఇక, టీ బ్రేక్‌‌‌‌ తర్వాత మయాంక్‌‌‌‌ స్పీడు పెంచాడు.  అజాజ్‌‌‌‌, సోమర్‌‌‌‌విల్లేను టార్గెట్‌‌‌‌ చేసి ఈజీ షాట్లతో వరుసగా బౌండ్రీలు సాధించాడు. అయితే, క్రీజులో కుదురుకున్న అయ్యర్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసిన అజాజ్‌‌‌‌ ఈ జోడీని బ్రేక్‌‌‌‌ చేశాడు. ఈ క్రమంలో అయ్యర్‌‌‌‌ ను బ్యాడ్‌‌‌‌లక్‌‌‌‌ వెంటాడింది. అజాజ్ వేసిన బాల్‌‌‌‌...ఇన్‌‌‌‌సైడ్‌‌‌‌ ఎడ్జ్‌‌‌‌ తీసుకొని అయ్యర్​ ప్యాడ్‌‌‌‌కు తగిలి కీపర్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ దొరికింది. ఈ దశలో అగర్వాల్‌‌‌‌కు సాహా తోడయ్యాడు. మయాంక్‌‌‌‌ జోరు కొనసాగించగా.. సాహా మంచి సపోర్ట్‌‌‌‌ ఇచ్చాడు. సిక్సర్‌‌‌‌తో ఖాతా తెరిచిన సాహా కూడా చాలా ఈజీగా బ్యాటింగ్‌‌‌‌ చేశాడు. ఈ క్రమంలో డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో కవర్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌తో ఫోర్‌‌‌‌ కొట్టిన మయాంక్‌‌‌‌ సెంచరీ కంప్లీట్‌‌‌‌ చేశాడు. 2019 తర్వాత కీలక టైమ్‌‌‌‌లో వచ్చిన సెంచరీ కావడంతో గట్టిగా అరుస్తూ సెలబ్రేట్‌‌‌‌ చేసుకున్నాడు. డే చివరి ఓవర్లో లాఫ్టెడ్‌‌‌‌ షాట్‌‌‌‌తో  లాంగాఫ్‌‌‌‌ మీదుగా సిక్స్‌‌‌‌ కొట్టి ఫస్ట్‌‌‌‌ డేను ఫినిష్‌‌‌‌ చేశాడు. 

కోహ్లీ ఔటా.. నాటౌటా?
ఈ మ్యాచ్‌‌‌‌లో విరాట్‌‌‌‌ కోహ్లీ ఔట్‌‌‌‌ వివాదాస్పదమైంది. అజాజ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో కోహ్లీ ఎల్బీ అయినట్టు ఫీల్డ్‌‌‌‌ అంపైర్‌‌‌‌ అనిల్‌‌‌‌ చౌదరి ప్రకటించాడు. ఇండియా కెప్టెన్‌‌‌‌ వెంటనే డీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ తీసుకున్నాడు. రీప్లేలో బాల్‌‌‌‌..  బ్యాట్‌‌‌‌తో పాటు ప్యాడ్స్‌‌‌‌ను తాకినట్టు కనిపించింది. కానీ, చాలా యాంగిల్స్‌‌‌‌ చూసిన తర్వాత బాల్‌‌‌‌ ముందుగా బ్యాట్‌‌‌‌ను తగిలిందనడానికి ఎవిడెన్స్‌‌‌‌ లేదంటూ టీవీ అంపైర్‌‌‌‌ వీరేందర్‌‌‌‌ సింగ్‌‌‌‌ ఔట్‌‌‌‌ ఇచ్చాడు. దీనిపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పెవిలియన్‌‌‌‌కు వెళ్తూ  బౌండ్రీ రోప్స్‌‌‌‌ను బ్యాట్‌‌‌‌తో కొట్టాడు. బ్యాట్‌‌‌‌ను తాకిన తర్వాత బాల్‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌ మారినా థర్డ్‌‌‌‌ అంపైర్‌‌‌‌ గుర్తించలేకపోయాడంటూ విమర్శలు వస్తున్నాయి.