తమిళనాడులో అన్నాడీఎంకే భారీ ర్యాలీ

తమిళనాడులో అన్నాడీఎంకే భారీ ర్యాలీ

చెన్నై: చాలా కాలం తర్వాత ప్రతిపక్ష అన్నాడీఎంకే కార్యకర్తలు భారీ ర్యాలీతో కదం తొక్కారు. విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను గుర్తించిన అన్నాడీఎంకే తొలిసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశంఖం పూరించింది. గత ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి స్థబ్దుగా ఉన్న ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు..రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. విద్యుత్ ధరలు పెంచుతూ తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెరిగిన ధరలు ఈనెల 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రజలపై భారం ఎక్కువవుతుందని.. వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ అన్నా డీఎంకే నేతలు డిమాండ్ చేశారు.