గుప్పెడు బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు

గుప్పెడు బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు
  • ఆరోగ్యం కోసం యోగా.. పౌష్టికాహారంలో రారాజు బాదం

బాదములను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు పోషక ఆహార నిపుణులు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేళ జీవనశైలిని ఆరోగ్యదాయకంగా ఉండేలా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆహారం విషయంలో గుప్పెడు బాదములు రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి తొలి అడుగు అవుతుందని సూచిస్తున్నారు. బాదము కేవలం పౌష్టికాహార స్నాకింగ్‌ అవకాశంగా మాత్రమే కాదు కనీసం వారానికి ఒకసారైనా తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని చెబుతున్నారు.
బాదములలో ప్రోటీన్‌ అధికంగా ఉండటంతో పాటుగా డైటరీ ఫైబర్‌ కూడా అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యవంతమైన బ్లడ్‌ షుగర్‌ స్థాయి నిర్వహించడంలో  సహాయపడటంతో పాటుగా టైప్‌ 2 మధుమేహంతో బాధపడుతున్న ప్రజలలో బ్లడ్‌ షుగర్‌ నియంత్రణకూ తోడ్పడుతుంది. అదే సమయంలో సాధారణంగా ఫాస్టింగ్‌ ఇన్సులిన్‌ స్థాయిపై ప్రభావం చూపే కార్బోహైడ్రేట్‌ ఫుడ్స్‌పై బ్లడ్‌ షుగర్‌ ప్రభావాన్ని సైతం తగ్గిస్తాయి.
ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించాల్సిన ఆవశ్యకత గురించి సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ ‘‘నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా చేస్తే మంచిదని.. వీలున్నంత వరకు సమతుల్యమైన శాకాహారంతోపాటు  ప్రొటీన్‌ అధికంగా ఉన్న బాదం  వల్ల కండరాల వృద్ధి, నిర్వహణకు బాదం మంచి పోషకం అవుతుందంటున్నారు. వర్కవుట్‌కు ముందు, తరువాత తినేందుకు అద్భుతమైన స్నాక్‌గా బాదం నిలుస్తుంది. వీటితో పాటుగా ఆకలిని తీర్చే వీటి గుణం కారణంగా భోజనాల నడుమ తీసుకునే స్నాక్‌గా తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలోనూ తోడ్పడుతుంది అంటున్నారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన, ఆరోగ్య వంతమైన జీవనశైలికి ప్రతిజ్ఞ చేయండి. దానిలో యోగా, ఆరోగ్యం మిళితం చేయండని పోషక ఆహార నిపుణులు సూచిస్తున్నారు.