ఒమిక్రాన్ ఎఫెక్ట్: పుణెలో డిసెంబర్ 15 వరకు స్కూళ్లు బంద్

ఒమిక్రాన్ ఎఫెక్ట్: పుణెలో డిసెంబర్ 15 వరకు స్కూళ్లు బంద్

కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకునేలోపే  కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పుట్టుకొచ్చింది. ఈ మహమ్మారి కారణంగా అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి.  ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి 7వ తరగతి వరకు పాఠశాలలను తిరిగి ప్రారంభించాలన్న నిర్ణయాన్ని డిసెంబర్‌ 15 వరకు పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ వాయిదా వేసింది. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించిన  తర్వాత  స్కూళ్స్ పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని  తెలిపింది. ఇంతకు ముందు డిసెంబర్‌ 1 నుంచి పాఠశాలలను పునః ప్రారంభించాలని ఆదేశించింది. గతంలో కరోనా కారణంగా అన్ని దేశాలు విద్యాసంస్థలను మూసివేశాయి. దాదాపు ఏడాదిన్నర వరకు స్కూల్స్ , కాలేజీలు మూతపడ్డాయి.