ప్రపంచ బ్యాంకుతో ఏపీ ఒప్పందం

ప్రపంచ బ్యాంకుతో ఏపీ ఒప్పందం
  • 250 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం

అమరావతి: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆదిశలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. సర్కార్ స్కూళ్లలో చదువుతున్న 50 లక్షల మంది విద్యార్థుల్లో నైపుణ్యం మెరుగు పరచడం కోసం  ప్రపంచ బ్యాంకుతో 250 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈనెల 18న ఏపీ ప్రభుత్వ అధికారులు సంతకాలు చేయనున్నారు. 
 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45వేల ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ తరగతుల్లో చదువుతున్న సుమారు 50 లక్షల మంది విద్యార్థుల్లో సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. సర్కార్ స్కూళ్ల విషయంలో ఏపీ ప్రభుత్వం పట్టుదలగా వ్యవహరిస్తూ ప్రపంచ బ్యాంకుతో కీలక ఒప్పందాన్ని కుదుర్చు కోవడాన్ని విద్యావేత్తలు, ఏపీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తుండగా.. ప్రభుత్వ నిర్ణయంపై  ప్రైవేటు విద్యా సంస్థలు ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలను ఆలోచనల్లో పడేసింది.