
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి)ని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన కసిరెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్లి విచారించనున్నారు.
మరోవైపు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్ కసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం (ఏప్రిల్ 21) విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు సమ్మతించలేదు. తదుపరి విచారణను వారం రోజులపాటు వాయిదా వేసింది.
ఈ క్రమంలో మంగళవారం (ఏప్రిల్ 22) విచారణకు హాజరవుతానని రాజ్ కసిరెడ్డి ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అయితే విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న సమయంలో.. తాను రేపు (మంగళవారం) స్వయంగా హాజరవుతానని పోలీసులను తెలియజేశాడు. కానీ హాజరవుతాడో లేదో అన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్నారుఏపీ సిట్ పోలీసులు.