
- సివిల్ సప్లయ్స్ జాయింట్ సెక్రటరీగా ఆశా మసరత్ ఖనమ్‌కు అదనపు బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ముజామిల్ ఖాన్ ను జీఏడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో జాయింట్ సెక్రటరీగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఆశా మసరత్ఖనమ్కుబాధ్యతలు అప్పగించింది. మరోవైపు హనుమంత్ కొడింబాకు సివిల్ సప్లై డిప్యూటీ డైరెక్టర్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బదిలీ అయిన అధికారులు వెంటనే విధుల్లో చేరాలని సీఎస్రామకృష్ణా రావు ఆదేశాలు జారీ చేశారు. గత రెండేండ్లుగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన ముజామిల్ ఖాన్నెల రోజుల కితం పౌరసరఫరాల శాఖకు బదిలీ అయ్యారు. ఇప్పుడు మళ్లీ బదిలీ అవ్వడం ఉద్యోగుల్లో హాట్ టాపిక్‌గా మారింది.