
దుబాయ్: యాషెస్ తొలి టెస్ట్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు జరిమానా పడింది. నిర్దేశిత టైమ్‌లో వేయాల్సిన ఓవర్ల కోటా కంటే రెండు తక్కువగా వేయడంతో ఇరుజట్లకు రెండు డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్) పాయింట్ల కోత విధించారు. అలాగే మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత పెట్టారు. 2023–25 సైకిల్ ప్రకారం ప్రస్తుతం ఆసీస్ 10, ఇంగ్లండ్ -–2 పాయింట్లతో ఉన్నాయి.