కాంగ్రెస్​కు స్కామ్​ల దెబ్బ ... కోల్ స్కామ్, లిక్కర్​స్కామ్​లో సీఎం హస్తం

కాంగ్రెస్​కు స్కామ్​ల దెబ్బ ... కోల్ స్కామ్, లిక్కర్​స్కామ్​లో సీఎం హస్తం
  • మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో లంచాలు
  • స్కామ్స్ అన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లిన బీజేపీ

రాయ్​పూర్: చత్తీస్​గఢ్​లో కాంగ్రెస్ ఓటమికి స్కామ్​లే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఐదేండ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, కుంభకోణాలే ఎజెండాగా బీజేపీ లీడర్లు ప్రచారం చేశారు. కాంగ్రెస్ స్కామ్​లన్నీ ప్రజల్లోకి వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. సెకండ్ ఫేజ్​ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హయాంలో జరిగిన కోల్ స్కామ్, లిక్కర్ స్కామ్, మహదేవ్ బెట్టింగ్ యాప్​కు సంబంధించిన వ్యవహారాల్లో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అధికార పార్టీ లీడర్ల ఇండ్లలో సోదాలు చేశారు. ఈ స్కామ్ వెనుక సీఎం బాఘెల్ హస్తం ఉందంటూ బీజేపీ ఆరోపించింది.

  •   మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో యాప్ ప్రమోటర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రూ.508 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
  • కస్టమ్ రైస్ మిల్లింగ్ స్కామ్​లో స్టేట్ మార్క్​ఫెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, ట్రెజరర్ రోషన్ చంద్రకర్, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ అధికారులు (డీఎంఓలు), మరికొంత మంది రైస్ మిల్లర్లు సహా రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్​లోని కొంత మంది ఆఫీస్ బేరర్ల హస్తం ఉన్నట్లు ఈడీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో రూ.175 కోట్ల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
  • మినరల్ ఫండ్ స్కామ్​లో ఇల్లీగల్​గా టన్ను బొగ్గుపై రూ.25 చొప్పున లెవీ తీసుకున్నట్లు తేలింది. ఈ స్కామ్​లో సీనియర్ అధికారులు, వ్యాపారులు, పొలిటికల్ లీడర్లు, దళారుల హస్తం ఉన్నట్లు ఈడీ తేల్చింది.
  • 2021 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో కూడా అవినీతి జరిగింది. చత్తీస్​గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీసీఎస్) అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
  • అవినీతి, కుంభకోణాల దర్యాప్తుల్లో కూడా సీఎం భూపేశ్ బాఘెల్ కల్గజేసుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఇక్కడ అధికార దుర్వినియోగం జరిగినట్లు విమర్శించింది. భూపేశ్ బాఘెల్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చార్జ్​ షీట్ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమంతా.. అవినీతి, కుంభకోణాలు, దోపిడీ మయమైందని ఆరోపించారు.