
హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ నిజాముద్దీన్. షాపుల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన షేక్ షరీఫ్ అనే వ్యక్తిని సబ్ రిజిస్ట్రార్ లంచం డిమాండ్ చేశారు. లంచం కోసం డాక్యుమెంట్ రైటర్ జియా ఉద్దీన్ మధ్యవర్తిత్వం నడిపాడు. విసిగిపోయిన బాధితుడు ఏసీబీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. డాక్యుమెంట్ రైటర్ జియా ఉద్దీన్ తో కలసి సబ్ రిజిస్ట్రార్ నిజాముద్దీన్ రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా హైదరాబాద్ ఏసీబి డి ఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఏసీబీ ఇన్స్ పెక్టర్లు, ఎస్.ఐ తదితరులు దాడి చేసి పట్టుకున్నారు. కార్యాలయంలో మొత్తం తనిఖీలు చేపట్టారు.