త్వరలో ఇండియలోకి క్యూ కట్టనున్న అమెరికా కంపెనీలు.. ట్రేడ్ డీల్ కుదరటమే తరువాయి: ట్రంప్

త్వరలో ఇండియలోకి క్యూ కట్టనున్న అమెరికా కంపెనీలు.. ట్రేడ్ డీల్ కుదరటమే తరువాయి: ట్రంప్

ఇండియాతో ఎప్పుడు ట్రేడ్ డీల్ ఫైనలైజ్ చేద్దామా అనే తహతహలో ఉన్నారు యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్. ప్రపంచ దేశాలన్నింటిపై టారిఫ్ లు విధిస్తూ వస్తున్న ట్రంప్.. భారత్ ను కూడా ఒప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర దేశాలను బలవంతంగా ఒప్పిస్తే.. ఇండియా దారిలోకి వస్తుందనే ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అప్పుడప్పుడు.. ఇండియాతో డీల్ ఓకే అయ్యింది అని.. ఇండియా మంచి డీల్ కుదుర్చుకుంటుంది అని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

 లేటెస్ట్ గా భారత్ తో ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ అయిపోయిందని కామెంట్ చేశారు ట్రంప్. తర్వలోనే టారిఫ్ ఒప్పందాలు ఫైనలైజ్ అవుతున్నట్లు ఇండోనేషియాతో కుదిరిన ఒప్పందం సందర్భంగా చెప్పారు. ఇండియాతో ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యింది. త్వరలోనే అమెరికన్ కంపెనీలు ఇండియాలో వ్యాపారం చేసుకునేందుకు మంచి యాక్సెస్ దొరుకుతుందని ప్రకటించారు. 

టారిఫ్ రేట్లు 20 శాతానికంటే తక్కువగా ఉండాలనే ఉద్దేశంతో ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి. వీలైనంత తక్కువ టారిఫ్ తో భారత్ లోకి అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీలను తీసుకురావాలని భావిస్తున్నారు. 

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇండోనేషియాతో డీల్ పూర్తయ్యింది. ఇక మాకు ఆ దేశంలోకి ఫుల్ యాక్సెస్ ఉంటుంది. ఇండియా తో కూడా త్వరలోనే పూర్తవుతుందని పేర్కొన్నారు. ఇండియాలోకి అమెరికా ఉత్పత్తులు.. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు.. తీసుకొచ్చి పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. 

టారిఫ్ లు ఆగస్టు 1 నుంచి అమలు అవుతాయని ఇప్పటికే అమెరికా పలు దేశాలకు లెటర్లు పంపింది. అయితే ఇండియా యూఎస్ నుంచి రెసిప్రోకల్ టారిఫ్ ను తగ్గించుకునేందుకు సరైన రేటుతో పన్నుల ఒప్పందాన్ని చేసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా ఆమోదయోగ్యమైన డీల్ వచ్చే వరకు చర్చలు కొనసాగిస్తోంది.