కేంద్రం సంస్కరణలపై విపక్షాలు రాద్ధాంతం : మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

కేంద్రం సంస్కరణలపై విపక్షాలు రాద్ధాంతం : మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
  • ఉపాధి కూలీలకు జీ రాంజీ ఎంతో ఉపయోగం 
  • హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

సిద్దిపేట టౌన్, వెలుగు:  మహాత్మా గాంధీ ఉపాధి హామీ స్కీమ్ 100 రోజుల పని మాత్రమే కల్పించేదని,  జీ- రాంజీ చట్టం ద్వారా150 రోజుల పని దినాలు కల్పిస్తున్నట్టు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. దేశాభివృద్ధికి కేంద్రం ఎన్నో సంస్కరణలు అమలు చేస్తుంటే, విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. శనివారం సిద్ధిపేటలో ఓ ప్రైవేట్ ప్రోగ్రామ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఉపాధి హామీ కూలీల కోసం కేంద్రం తెచ్చిన  జీ రాంజీ చట్టం గ్రామీణ కూలీలకు ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు.  దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. బీజేపీని గ్రామాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. బీజేపీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌ లు, వార్డు మెంబర్లను ఆయన  సన్మానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ యాదవ్, సీనియర్ నేతలు పాల్గొన్నారు.