
మూవీ ఆర్టిస్ అసోసియేషన్(MAA) ఎన్నికల్లో రాజకీయాలు తారాస్థాయి చేరాయి. రాజకీయ పార్టీను తలదన్నేలా రాజకీయం నడుస్తోంది. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ పోటీపడుతున్నాయి. రెండు ప్యానెళ్ల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు వేడెక్కిస్తున్నాయి. లేటెస్టుగా మా ఎన్నికల బరిలోంచి తప్పుకుని బండ్ల గణేష్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తాను వేసిన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అంతేకాదు..నాదైవ సమానులు, నా ఆత్మీయులు,నా శ్రేయోభిలాషులు సూచనల మేరకు నేను 'మా' జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. ట్విట్టర్ లో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్‌లతో దిగిన ఫొటోను షేర్ చేశాడు.
ప్రకాష్ రాజ్ అన్న నా దగ్గరకు వచ్చి పోటీ నుంచి విరమించుకోవాలని కోరడంతో తాను పోటీ నుంచి బయటకు వచ్చానని తెలిపాడు బండ్ల గణేష్. తన మద్దతు ప్రకాష్ రాజ్ ప్యానల్ కే అని తెలిపారు. 'మా' లో మహాసంగ్రామ జరుగుతుందన్నాడు. మరోవైపు పోసాని ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ లాంటి వాడని విమర్శించారు.
‘మా’ ఎన్నికలు: పోటీ నుంచి తప్పుకున్న బండ్ల గణేశ్....
— Bandla Ganesh Trends (@BandlaTrends) October 1, 2021
తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాగు కోసం ప్రాణ త్యాగం అయిన చేస్త :-@BandlaTrends @ganeshbandla
#bandlaganesh #MaaElections2021 pic.twitter.com/5HVrUwP8eu