రూ.20 దొంగతనానికి మూడేళ్ల జైలు శిక్ష 

V6 Velugu Posted on Jun 14, 2021

ఓ దొంగతనం కేసులో సంచలన తీర్పునిచ్చింది ముంబై బాంద్రా మెట్రోపాలిటన్ కోర్టు. ముంబైకి చెందిన 26 ఏళ్ల కార్మికుడు ఇరవై రూపాయలు దొంగిలించిన కేసులో నిందితునికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దొంగిలించే సమయంలో నిందితునికి.. బాధితునికి గొడవ జరిగింది. అందులో బాధితుడు తీవ్రంగా గాయపడ్డారని తెలిపిన ఈ మేరకు తీర్పునిచ్చింది. నిందితుడు అర్జున్‌ గైక్వాడ్‌ ఏడు నెలల నుంచి జుడిషియల్‌ కస్టడీలో ఉంటున్నాడు. విచారణ సందర్భంగా.. అతను కోర్టుకు తాను నేరం అంగీకరించినట్టు మార్చినెలలో లేఖ ద్వారా తెలియజేశాడు. కోర్టు కూడా అతను చేసిన నేరాన్ని స్వచ్ఛందంగా ఒప్పుకోవడంతో.. నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

Tagged Bandra Metropolitan Court, sentenced three years jail, stealing Rs 20

Latest Videos

Subscribe Now

More News