స్కిన్​కేర్​ విషయంలో రష్మిక చాలా జాగ్రత్తలు

స్కిన్​కేర్​ విషయంలో రష్మిక చాలా జాగ్రత్తలు

స్కిన్​కేర్​ విషయంలో రష్మిక చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ​ సీక్రెట్​ గురించి ఈమధ్య రివీల్​ చేసింది. అదేంటంటే.. అందం దెబ్బతినకుండా ఉండాలంటే హెల్దీఫుడ్​ తినాలి. పడని ఫుడ్​ తింటే ఆ ఎఫెక్ట్​ అందం మీద పడుతుంది. అందుకే రష్మిక కొత్తరకం ఫుడ్​ తినేముందు ఫుడ్​ అలర్జీ టెస్ట్ చేయించుకుంటుంది. అంతేకాదు నూనె ఎక్కువ ఉన్న కూరలు, వేపుళ్లలాంటివి తిననేతినదట. చర్మం లేతగా కనిపించేందుకు నీళ్లు బాగా తాగుతుంది. సన్​స్క్రీన్​ రాసుకోనిదే బయటకి అడుగుపెట్టదు. స్కిన్​ మెరుస్తూ ఉండేందుకు రెగ్యులర్​గా విటమిన్​–సి సీరమ్​ వాడుతుంది. మాయిశ్చరైజర్​ ముఖం మీద మాత్రమే రాసి వదిలిపెట్టకుండా మెడ, కళ్ల కింద కూడా రాసుకుంటుంది. చర్మం పొడిబారుతుందని రోజుకు రెండుసార్లు మాత్రమే ముఖాన్ని శుభ్రం చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు చర్మంమీద ఉండే డెడ్​సెల్స్​ను తీసేసి, చర్మం ఫ్రెష్​గా ఉండేలా జాగ్రత్త పడుతుంది.