V6 News

సమస్యలు పరిష్కరించాలని బీడీ కార్మికుల ధర్నా

సమస్యలు పరిష్కరించాలని బీడీ కార్మికుల ధర్నా

​ఆర్మూర్, వెలుగు :  తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ బీడీ కార్మికులు గురువారం ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో ఆర్మూర్ లోని మోడ్రన్ బీడీ కంపనీ ముందు ధర్నా నిర్వహించారు. ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు బి సూర్య శివాజీ మాట్లాడుతూ కంపెనీ యజమాన్యం కార్మికుల అమాయకత్వాన్ని నిరాక్షరాస్యతను ఆసరా చేసుకుని కార్మిక చట్టాలను తుంగలో తొక్కి మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మోడ్రన్ బీడీ కంపెనీపై లేబర్ అధికారులకు ఫిర్యాదు చేసి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

 ఇప్పటికైనా కంపెనీ యజమాన్యం మొండి వైఖరి వీడి రాజీనామా చేసిన కార్మికుల గ్రాట్యూటీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. బకాయి ఉన్న బట్వాడాలు వెంటనే ఇచ్చి నెలనెలా వేతనాలు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో కార్మికులతో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీడీ కార్మికులు సమీరా, లక్ష్మీనర్సు, అరటి అనిత, అనూష, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.