బెంగళూరులో నిన్నటి నుంచి భారీ వర్షం

బెంగళూరులో నిన్నటి నుంచి భారీ వర్షం
  • ఈదురుగాలులతో విరిగిపడిన చెట్లు.. జనం ఇబ్బందులు

బెంగుళూరు: ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు భరించలేని వేసవి తాపంతో బెంగళూరు వాసులు రెట్టింపు కష్టాలు పడుతుతన్నారు. బెంగళూరులో ఆదివారం ఉదయం విపరీతమైన ఎండ తీవ్రత కనిపించింది... కానీ సాయంత్రం అయ్యే సరికి వాన వర్షం స్టార్ట్ అయ్యింది. బెంగళూరు సహా కోలారు, కొడగు, మైసూరు జిల్లాల్లో భారీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన పడడంతో.. ట్రాఫిక్ జామ్ అయ్యింది.

బెంగళూరులో సుమారు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురు గాలుల వర్షానికి.. బెంగళూరులోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. డ్రైనేజీ కాల్వలు నిండిపోయి.. రోడ్లపై నీరు నిలిచిపోయింది. మున్సిపల్ అధికారులు అప్రమత్తం అవడంతో.. ఇళ్లల్లోకి నీరు చేరలేదు. 

రంగంలోకి దిగిన సహాయక బృందాలు.. హెల్ప్  లైన్ ఏర్పాటు
బెంగళూరులో భారీ వర్షాలు పడటంతో.. బృహత్ బెంగళూరు మహానగర్ పాలికె అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో విరిగి పడిన చెట్ల కొమ్మలను అధికారులు తొలగించారు. లోతట్టు ప్రాంతాలపై దృష్టి నిలిపి, సహాయ చర్యలు చేపట్టేందుకు బృందాలను పంపారు. మరోవైపు ఎడతెగని విద్యుత్ కోతలతో బెంగళూరు వాసులు ఇబ్బందులు పడుతున్నారు.

వర్షం వల్ల ఇబ్బందులు కలిగితే సంప్రదించేందుకు హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు బెంగళూరు అధికారులు. చెట్ల కింద నిలబడడం, వాహనాల్లో సంచరించడం తగదని అధికారులు సూచించారు. మరో మూడు రోజుల పాటు బెంగళూరులో  భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. కర్ణాటక తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. 

 

ఇవి కూడా చదవండి

ముంబై - బెంగాల్ స్పైస్ జెట్ విమానంలో భారీ కుదుపులు

మందుల ధరలు 10 శాతం పెరిగే అవకాశం!

మైక్రో ఇన్సూరెన్స్ గరీబులకు వరం