జ్యోతిష్యం:  జాతకంలో నక్షత్రాల ప్రభావం ఎలా ఉంటుంది..  ఏ నక్షత్రంలో పుట్టిన వారు ఎలా ఉంటారు

జ్యోతిష్యం:  జాతకంలో నక్షత్రాల ప్రభావం ఎలా ఉంటుంది..  ఏ నక్షత్రంలో పుట్టిన వారు ఎలా ఉంటారు

హిందూ సంప్రదాయంలో ఎవరికైనా బిడ్డ పుడితేచాలు.. వెంటనే పండితుల దగ్గరకు వెళతారు.. అయ్యగారు మాకు బిడ్డ పుట్టింది.. ఏ అక్షరంతో పేరు పెట్టాలి.. అని అడుగుతుంటారు.  అప్పుడు పండితులు ఆ బిడ్డ పుట్టిన సమయాన్ని బట్టి.. నక్షత్రం ఆధారంగా సూచిస్తారు.  అంటే భవిష్యత్తులో జాతకం చూడాలంటే పేరుబలాన్ని బట్టి చూసే సంప్రదాయం కొనసాగింది.  జ్యోతిష్య ప్రకారం.. ఏ నక్షత్రంలో పుట్టిన వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..! 

పంచాంగం ప్రకారం నక్షత్రాలు 27 ఉంటాయి.  అందుకే పుట్టినప్పుడు దోషకాలం ఉంటే.. 27 రోజుల్లోపు చేసుకోవాలని పండితులు చెబుతుంటారు. ఒక్కో నక్షత్రంలో పుట్టిన వారు దాని ఆధారంగా లక్షణాలు కలిగి ఉండి .. ప్రవర్తిస్తుంటారని పండితులు చెబుతుంటారు.  నక్షత్రం ఆధారంగా జన్మరాశిని కూడా నిర్దేశిస్తారు.  27 నక్షత్రాలు  జాతకుని స్వభావాలు తెలుపుతాయంటున్నారు జ్యోతిష్యులు.

1. అశ్విని : ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు సంచార స్వభావం కలవారిగా ఉంటారు. చపలత్వంతో కూడిన స్వభావం కలిగి ఉంటారు. 

2. భరణి : ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు స్వార్థ ప్రవృత్తి కలిగినవారిగా ఉంటారు. వీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతారని పండితులు చెబుతుంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు  ఎల్లప్పుడు ఇతరులపై ఆధారపడి, ఇతరుల నిర్ణయాలను తమ నిర్ణయాలుగా భావిస్తుంటారు.

3.  కృత్తిక : ఈ  నక్షత్రంలో పుట్టినవారికి సాహసం ఎక్కువుగా ఉంటుంది. ఇతరుల వస్తువులు తమవిగా ఆక్రమించుకొనే స్వభావాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు అహంకార స్వభావాన్ని ప్రదర్శిస్తుంటారు.  ఈనక్షత్రంలో జన్మించిన వారు నిప్పు, వాహనాలు, ఆయుధాలంటే ఎక్కువగా భయపడుతుంటారని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.

4. రోహిణి : ఈ  నక్షత్రంలో పుట్టినవారు చాలా ప్రశాంతంగా ఉంటారు.  డ్యాన్స్​, ఆర్ట్​ మొదలగు కళా రంగం అంటే ఎక్కువ ఇష్టపడుతుంటారు. వీరు మనసులో ఏదీ దాచుకోరు.చాలా  ఉన్నతమైన భావాలు కలిగిన వారిగా ఉంటారు.

5.  మృగశిర : ఈ నక్షత్రంలో పుట్టిన  జాతకులు విలాసవంతమైన జీవితం గడుపుతూ భోగలాలసులు ఉంటారు. వీరికి అమితమైన తెలివి ఉంటుంది.  కాని ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేయరు.  తమ తెలివితేటలను అవసరమైన సందర్భంలో ఉపయోగించడంలో విఫలమవుతారు. 

6.  ఆరుద్ర :ఈ  నక్షత్ర జాతకులకు కోపం అధికంగా ఉంటుంది.  ఏదైనా నిర్ణయం తీసుకొనేటప్పుడు  అది మంచా.. చెడా అని కూడా ఆలోచించరని ... ఎవ్వరిని  నమ్మరని జ్యోతిష్యులు అంటున్నారు.

7 పునర్వసు : ఈజాతకులు ఆదర్శవాదులుగాను, ఇతరులకు సహాయ సహకారాలందించేవారిగా ఉంటారు. ముఖ్యంగా వీరు శాంత చిత్త స్వభావులు. ఆధ్యాత్మికం అంటే వీరికి అమితమైన ఇష్టం.

8 ఆశ్లేష : ఈ  నక్షత్ర జాతకులు మొండిగా వ్యవహరిస్తారు.  మంకుపట్టు స్వభావులై ఉంటారు. వీరిలో ఆత్మన్యూనతాభావం ఎక్కువగా ఉంటుంది. స్వయంగా కష్టాలను కొని తెచ్చుకుంటారని పండితులు చెబుతున్నారు.

9. మఖ : ఈ  నక్షత్రంలో చాలా పవర్​ ఫుల్​.. ఈ నక్షత్ర ఘడియల్లో జన్మించినా.. రజస్వల అయినా.. మరి ఏ ఇతర ఘటన జరిగినా తప్పకుండా శాంతి చేయించుకోవాలి.  ఈ నక్షత్ర జాతకులు స్వాభిమానిగా ఉంటారు. గొప్ప గొప్ప కోరికలుంటాయి. సహజంగా నేతృత్వం వహించే లక్షణాలుంటాయంటున్నారు జ్యోతిష్యులు.

10. పూర్వాభాద్ర : వీరు కళలపట్ల ఎక్కువ మక్కువ చూపుతుంటారు. క్రీడలంటే అమితమైన ఇష్టంగా ఉంటారు. 

11.  ఉత్తరాభాద్ర : ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఇతరులతో  ఆచితూచి వ్యవహరిస్తుంటారు.  ప్రతి మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతారు.  కష్టపడి పనిచేసే స్వభావం కలవారై ఉంటారు .

12 హస్త : ఈ నక్షత్రం జాతకులు కల్పనా జగత్తులో విహరిస్తుంటారు. వీరు సుఖ వంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. సత్ప్రవర్తన కలిగి ఉంటారు.

13  చిత్త :  ఈ నక్షత్రంలో జన్మించిన   జాతకులు చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ కనపరుస్తారు. కొత్త కొత్త ఫ్యాషన్‌లంటే అమితమైన ఇష్టం. ఎదుటివారిని ఆకర్షించే గుణం వీరిలో ఉంటుంది. ప్రధానంగా భిన్న లింగ వ్యక్తులతో ఎక్కువగా మసలుతుంటారు. కొత్త విషయం కనపడిదంటే చాలు.. దాని అంతు చూడకుండా వదిలిపెట్టరు. 

14 స్వాతి :  ఈ నక్షత్రంలో జన్మించిన వారు   అందరిని సమానంగా చూస్తుంటారు. వీరి మనసును అదుపులో ఉంచుకుంటారు. కష్టాలను ఓర్చుకునే స్వభావులై ఉంటారంటున్నారు.  ఏదైనా సమస్య వస్తే కాలమమే పరిష్కరిస్తుందనే విధంగా వ్యవహరిస్తుంటారని  జ్యోతిష్యులు చెబుతున్నారు. 

15  విశాఖ :  ఈ నక్షత్రంలో జన్మించిన వారు   స్వార్థపరులుగాను, జగమొండిగా వ్యవహరిస్తారు. తాము అనుకున్నది చేయాలనే ధోరణి కలిగి ఉంటారు.  ఏదో ఒక విధంగా తమదే పై చేయిలా అనిపించుకుంటుంటారు.

16.  అనూరాధ : ఈ నక్షత్రంలో జన్మించిన వారు  కుటుంబం.. కుటుంబసభ్యుల విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.   ఈ నక్షత్రలో పుట్టిన వారికి  శృంగారంమంటే చాలా ఇష్టంగా ఉంటారు. చాలా మృధు స్వభావంతో ఉండి.. ఎప్పుడు  అందంగా.. ఆకర్షణీయంగా కనపడతారు. 

17  జ్యేష్ఠ :  ఈ నక్షత్రంలో జన్మించిన వారి  స్వభావం స్వచ్ఛమైనదిగానూ, ఎల్లప్పుడూ సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతుంటారు. కాని వీరు శత్రువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను వదలరు. దొంగచాటుగా శత్రువులపై దాడికి దిగుతుంటారు.

18 మూల :  ఈ నక్షత్రంలో జన్మించిన వారి  ప్రారంభపు జీవితం కష్టతరంగాను, కుటుంబంనుంచి చీదరింపులను ఎదుర్కోక తప్పదు. కళలంటే అమితమైన ఇష్టం. వీరు కళాకారులుగా రాణిస్తారు.

19  పూర్వాషాఢ : ఈ నక్షత్ర జాతకులు శాంతస్వభావులుగా ఉంటారు. ప్రతి పనిని చాలా దీర్ఘంగా ఆలోచించి చేస్తారు.  ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు.  ఎదుటి వ్యక్తులను అంచనా వేయడంలో వీరికి వీరే సాటి.. 

20  ఉత్తరాషాఢ : ఈ జాతకులు వినయ స్వభావులై ఉంటారు. వీరిలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. అందరినీ కలుపుకుపోయే తత్వంతో ఉంటారు. సమాజంలో గౌరవం.. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. 

21  శ్రవణం :  ఈ నక్షత్రంలో జన్మించిన వారు  సన్మార్గులై, పరోపకారిగాను ఉంటారు. ఇతరులకు ఏదైనా ఆపద వస్తే సొంత పని కూడా వదిలిపెట్టి వెళ్లి వారికి సాయపడతారు. వీరికి స్నేహితులు కూడా అధికంగా ఉంటారు. 

22  ధనిష్ట :  ఈ నక్షత్రంలో జన్మించిన వారి  వ్యవహారం కటువుగా వుంటుంది. కోపం వీరి సొత్తులాగా ఉంటుంది. వీరు నిత్యం అహంకార పూరితులై ఉంటారు.  ఎవరిని లెక్క చేయకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. 

23 శతభిషం : ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు మహిళల పట్ల ఆశక్తి చూపుతారు. వీరు మహిళలతో గడిపేందుకు ఎక్కువ మక్కువచూపుతారు.  వీరికి ఎప్పుడు ఏ పని చేయాలనిపిస్తే అప్పుడు అది చేస్తారు. దాని వలన నష్టమొస్తుందా.. మేలు జరుగుతుందా.. అని  ఏమాత్రం అలోచించరు.  అది ఏ సందర్భమైనా సరే పట్టించుకోరు.. వారు చేయాలనుకున్నది చేస్తారని పండితులు అంటున్నారు. 

24 పుష్యమి :  ఈ నక్షత్రంలో  పుట్టినవారు సన్మార్గులై ఉంటారు. వీరు బుద్ధిమంతులుగాను, ఇతరులకు దానం చేసే స్వభావులై ఉంటారు. వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.

25 పూర్వాభాద్ర :  ఈ నక్షత్రంలో జన్మించిన  జాతకులు బుద్ధిమంతులై, పరిశోధనాత్మకమైన దృక్పథం కలిగినవారిగా ఉంటారు. వీరు తమకు అందిన పనిని సమయానుసారం సమర్థవంతంగా నిర్వహిస్తుంటారు.

26  ఉత్తరాభాద్ర :  ఈ నక్షత్రంలో  పుట్టిన వారు ఇతరులను ఆకర్షించే స్వభావం కలిగినవారై ఉంటారు. వీరి మాటల్లో చతురత కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఇతరులను ప్రభావితం చేసే గుణం వీరిలో ఉంటుంది.

27  రేవతి :  ఈ  నక్షత్ర జాతకులు సత్యవాదులై ఉంటారు. ఎల్లప్పుడూ ప్రజల బాగు కొరకు శ్రమిస్తుంటారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.