పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

పెగడపల్లి, వెలుగు: ఈదురు గాలులు, అకాల వర్షంతో    మామిడి కాయలు  నేలపాలయ్యాయని, రైతులకు ఎకరాకు రూ. 40 వేల నష్ట పరిహారం అందజేయాలని రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు బతికే పెల్లి ఎంపీటీసీ చింత కింది అనసూయ, మండల బీజేపీ శాఖ అధ్యక్షుడు గంగుల కొమురెల్లి శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని బతికెపల్లి గ్రామంలోని అకాల వర్షంతో నేలపాలైన మామిడి తోటలను పరిశీలించారు. అగ్రికల్చర్, హర్టికల్చర్ అధికారులతో మామిడి  రైతులకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలన్నారు.  కార్యక్రమంలోబీజేపీ నాయకులు సంకటి రవీందర్ రెడ్డి,కొత్తూరి బాబు, నరేందర్, మన్నె రమేష్, చింతకింది కిషోర్ కుమార్, పోరెడ్డి మల్లేష్,లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.
మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి డివిజన్ పరిధిలో ఈదురుగాలులతో నష్టపోయిన మామిడి, నువ్వు పంట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్లూరి మహేందర్ రెడ్డి అన్నారు.  మెట్ పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు.  జగిత్యాల రూరల్,  వెలుగు: ఈదురు గాలులకు మామిడిపంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని  ఎకరాకు  రూ .50, 000 నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.  

జిల్లాలో 10,915 ఎకరాల్లో పంట నష్టం

జగిత్యాల, వెలుగు: జిల్లా లో గురువారం  అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, ధర్మపురి, రాయికల్, సారంగాపూర్, మల్లాపూర్ మండలాల్లో మామిడి, మక్కజొన్న, నువ్వు పంట నష్టపోయినట్లు ఆగ్రికల్చర్ ఆఫీసర్లు గుర్తించారు.  సుమారు 9402 ఎకరాల్లో మామిడి పంట నేల రాలిపోయినట్లు హర్టికల్చర్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. 10,915 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు తెలుస్తోంది.