పసుపు బోర్టు ప్రకటన.. బీజేపీ నేతల సంబరాలు

పసుపు బోర్టు ప్రకటన.. బీజేపీ నేతల సంబరాలు

 తెలంగాణకు పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో  రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు  సంబరాలు చేసుకుంటున్నారు.  నిజామాబాద్ జిల్లాలో  పసుపు నీళ్లతో ప్రధాని మోదీ, ఎంపీ ధర్మపురి అరవింద్ కు అభిషేకం చేశారు.  మోర్తాడ్ మండల కేంద్రంలో మోడీకి పాలాభిషేకం చేశారు

ఆర్మూర్ పట్టణంలో బీజేపీ నేతలు బ్యాండు బాజాలతో రోడ్లపై టపాసులు కాల్చారు.  పసుపుతో ఒకరిపై ఒకరు చల్లుకుంటూ డ్యాన్సులు చేశారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ ముందు టపాసులు పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి మామిడిపల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.

Also Read :- మోదీ చేసిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవే

జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాహసిల్ చోలేరస్తా దగ్గర బీజేపీ నేతలు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. జగిత్యాల నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మోడీకి పసుపుతో అభిషేకం చేశారు. ర్యాలీలతో హోరెత్తించారు. బీజేపీ మాట నిలబెట్టుకుందని చెప్పారు.