రూ. 13500 కోట్ల పనులకు శ్రీకారం.. మోదీ చేసిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవే..

 రూ. 13500 కోట్ల పనులకు శ్రీకారం.. మోదీ చేసిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవే..

తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపించారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వరంగల్ – ఖమ్మం – విజయవాడ హైవే పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత  కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్‌ను ప్రారంభించారు. అటు  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొత్త భవనాలు ప్రారంభించారు. హసన్-చర్లపల్లి హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ పైప్ లైన్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. దీంతో పాటు సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు. మొత్తం రూ. 13,500 అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు చేశారు. 

మోదీ చేసిన  శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవే..

  •  నాగ్‌పూర్ -విజయవాడ ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించి రూ. 6400 కోట్ల  రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన
  • హైదరాబాద్ వైజాగ్  కారిడార్‌కు సంబంధించిన NH- 365BB రహదారి ప్రాజెక్ట్‌లో 59 కి.మీ పొడవు గల సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు నాలుగు లేనింగ్‌లకు రూ. 2460 కోట్ల భారతమాల పరియోజన కింద అభివృద్ధి చేయబడిన రహదారి ప్రారంభం
  •  రూ. 500కోట్లతో  ‘37 కిలో మీటర్ల జక్లెయిర్ – కృష్ణా కొత్త రైల్వే లైన్ కు శంకుస్థాపన
  •  కర్ణాటకలోని హాసన్ నుండి చెర్లపల్లి వరకు ఆయిల్ అండ్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు రూ. 2710 కోట్లతో శంకుస్థాపన
  •  కృష్ణపట్నం నుండి హైదరాబాద్ (మల్కాపూర్) వరకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్  యొక్క రూ. 1940 కోట్ల మల్టీ-ప్రొడక్ట్ పెట్రోలియం పైప్‌లైన్ కు శంకుస్థాపన
  •  హైదరాబాద్ యూనివర్సిటీలో ఐదు కొత్త భవనాలను ప్రారంభం..