కేసీఆర్, కేటీఆర్ను ఎందుకు లోపలేస్తలేరు? : ఎంపీ అర్వింద్

కేసీఆర్, కేటీఆర్ను ఎందుకు లోపలేస్తలేరు? : ఎంపీ అర్వింద్
  • కవిత రాజీనామాను ఎందుకు ఆమోదిస్తలేరు: ఎంపీ అర్వింద్ 

హైదరాబాద్, వెలుగు: అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా.. వివిధ అవినీతి అక్రమాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావును ఎందుకు లోపలేయడం లేదని రాష్ట్ర సర్కారును బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. కాళేశ్వరం కేసులో ఘోష్ కమిటీ నివేదికలోనూ కేసీఆర్ ది తప్పేనని తేల్చినా.. ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలపై రేవంత్ రెడ్డి కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు.

గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్ రేసింగ్​లో కేటీఆర్​ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కవిత తన ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మాట్​లో రాజీనామా చేసినా.. ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. హరీశ్ రావు పాల వ్యాపారం.. సంతోష్ టానిక్ సంగతి ఏంటో చెప్పాలన్నారు. గతంలో తప్పుడు హామీలన్నీ  ఇచ్చి.. ఇప్పుడు డబ్బులు లేవని చెప్పడం సరికాదన్నారు.