వారం పాటు తిరంగా యాత్ర

వారం పాటు తిరంగా యాత్ర
  • బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి వెల్లడి
  • 9- నుంచి 15వ తేదీ వరకు ప్రోగ్రామ్స్ 

హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు  ‘హర్ ఘర్ తిరంగా’, ‘తిరంగా యాత్ర’ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. మనోహర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంపై రాష్ట్రస్థాయి వర్క్‌‌‌‌‌‌‌‌షాప్ జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీ, మధ్యప్రదేశ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పాల్గొని, కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి కార్యక్రమాల షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 6 నుంచి -8 వరకు జిల్లా,మండల స్థాయిలో వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌లు నిర్వహించనున్నారు. 

9-నుంచి12 వ తేదీ వరకు బీజేవైఎం (భారతీయ జనతా యువ మోర్చా), మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తిరంగా యాత్రలు, దేశభక్తి కార్యక్రమాలు జరుగుతాయి.12 నుంచి -14 వరకు స్వాతంత్ర్య పోరాట స్మారక చిహ్నాలు, యుద్ధ స్మారక చిహ్నాల చుట్టూ స్వచ్ఛతా కార్యక్రమాలు చేపడతారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు, అమరవీరుల కుటుంబాలను సన్మానిస్తారు. 13 నుంచి-15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే కార్యక్రమం జరుగుతుంది.  ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్ రాష్ట్ర కన్వీనర్‌‌‌‌‌‌‌‌గా జి. మనోహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ నియమితులయ్యారు.