పులిని చంపినందుకు రూ.11వేలు బహుమతి

పులిని చంపినందుకు రూ.11వేలు బహుమతి

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో అటవీ శాఖ అధికారులు పులిని కాల్చి చంపారు. గత కొద్ది రోజులుగా మలేతా గ్రామంలోని ప్రజలపై ఓ పులి దాడి చేసి గ్రామస్థులను భయభ్రాంతుకు గురిచేస్తుంది. సుమారు 10మందిపై పులి దాడి చేసింది. దీంతో ఊరు విడిచి వెళ్లిపోదామని ప్రజలు నిర్ణయించుకున్నాడు. స్థానికంగా దేవప్రయాగ ఎమ్మెల్యే స్పందించి అటవి అధికారులతో చర్చించి ఓ ఆపరేషన్ జరిపించారు. 15మంది అటవి శాఖ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పుని కాల్చి చంపారు. ఈ ఆపరేషన్ లో ఆ ప్రాంత ఎమ్మెల్యే  వినోద్ కందారి కూడా పాల్గొన్నారు. డ్రోన్ కెమోరాతో పులిని గుర్తించి గన్ తో కాల్చి చంపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.