
కొంతమంది హీరోలు నటించడానికి..అది ఎటువంటి క్యారెక్టర్ అయిన..ఆ పాత్రల్లో ఇమిడిపోవడానికి చాలా కష్టపడుతుంటారు. సౌత్ లో క్యారెక్టర్ రైజేషన్ లో కష్టం అనే మాట విన్నాం అంటే..ముందు గుర్తొచ్చే హీరో తమిళ స్టార్ హీరో విక్రమ్. అలాగే హీరో సూర్య, కార్తి, తెలుగులో అల్లు అర్జున్,ఎన్టీఆర్,రానా లాంటి వారు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తమని తాము ఎలా అయిన మలుచుకోవడానికి రెడిగా ఉంటారు. ఇప్పుడు అదే కోవలోకి మారిపోయాడు యానిమల్(Animal) విలన్ బాబీ డియోల్ (BobbyDoel).
బాలీవుడ్లో హీరోగా చేస్తూనే..క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తూ..ప్రెజెంట్ మోస్ట్ వైలెంట్ విలన్గా పేరు తెచ్చుకున్నారు బాబీ డియోల్. సందీప్ రెడ్డి వంగా(Sandeepreddyvanga) డైరెక్షన్ లో వచ్చిన యానిమల్( మూవీలో బాబీ డియోల్ పవర్ ఫుల్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.
ఈ మూవీలో విలన్ పాత్ర కోసం తాను ఎంత కష్ట పడ్డాడో..తనను తాను మలుచుకున్న ఆ ఇంటెన్స్ క్యారెక్టర్ ఇట్టే చెప్పేస్తోంది. ఇందులో లుక్ కోసం ఏకంగా నాలుగు నెలల పాటు అత్యంత కష్టమైన డైట్ మెయింటేన్ చేస్తూ..ప్రతి రోజు కష్టతరమైన వ్యాయామం చేస్తూ వచ్చారు. అంతేకాకుండా..తనకి ఇష్టమైన స్వీట్ కూడా తినడం మానేసినట్లు యూనిట్ వర్గాలు ప్రమోషన్స్ టైములోనే తెలిపారు.
ఇక సినిమా రిలీజ్ అయ్యాకా ఇప్పుడు ఆడియాన్స్ అంతా బాబీ డియోల్ ఇంటెన్స్ లుక్స్..ఆ గంబీరమైన నటన గురుంచే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటివరకు అతని నటించిన సినిమాల్లో ది బెస్ట్ రోల్ యానిమల్ లోని అబ్రార్ హక్ పాత్ర అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా బాబీ డియోల్ స్వీట్ తింటూ ఎంజాయ్ చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాబీ డియోల్ క్యారెక్టర్ లోని ఇంటెన్స్ వల్లే..యానిమల్ కి భారీతనం వచ్చిందంటూ సినీ క్రిటిక్స్ నుంచి టాక్ వినిపిస్తోంది. ఇందులో బాబీ కనిపించేది తక్కువ సేపు అయినప్పటికీ..అతని క్యారెక్టర్ డిజైన్ ఇంపాక్ట్ ఆడియన్స్ కు పిచ్చెక్కించేస్తోంది. ఇక సినిమా క్లైమాక్స్ లో బాబీ చూపించే సైకో హావభావాలు థియేటర్స్ లో విజిల్స్ తో మోత మోగుతున్నాయి. వైల్డ్ హీరోకి వైల్డ్ విలన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.